#637Telugu Spiritual Song
Yehova naa mora laalinchenu
యెహోవా నా మొర లాలించెను - దన మహాదయను నను గణించెను
ప|| యెహోవా నా మొర లాలించెను - దన మహాదయను నను గణించెను(2)
అహర్నిశల దీనహీనుడగు నా - దు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను
1. పిశాచి గడిమి బడగొట్టెను - దన - వశాన నను నిలువబెట్టెను -
ప్రశాంత మధుర సు - విశేష వాక్ప్ఛల - నిశాంతమున జే - ర్చి సేద దీర్చెను
2. మదావళము బోలు నా మదిన్ - దన - ప్రదీప్త వాక్యాం కూశా హతిన్ -
యధేచ్చలన్నిటి గుదించి పాపపు - మొదల్ తుదల్ నరి - కి దరికి జేర్చెను
3. అనీతి వస్ర్త మెడలించెను - యే - సునాధు రక్తమున ముంచెను -
వినూత్న యత్న మె - ద నూని యెన్నడు - గనన్ వినన్ బ్రేరే - మనాకు జూపెను
4. విలాపములకు జెవి నిచ్చెను - శ్రమ - కలాపములకు సెలవిచ్చెను -
శిలానగము పైకి లాగి నను సుఖ - కళావళుల్ మన - సులోన నిలిపెను
5. అగణ్య పాపియని త్రోయక - నన్ను గూర్చి తన సుతుని దాచక -
తెగించి మృతి కొప్పగించి పాపపునెగుల్ దిగుల్ సొగ - సుగా నణంచెను
