18px
#636Telugu Spiritual Song

Tambura sitaaratho - maa prabhuni aaraadinchedamu

తంబుర సితారతో - మా ప్రభుని ఆరాధించెదము

ప|| తంబుర సితారతో - మా ప్రభుని ఆరాధించెదము తన నివాసముగ మమ్ము సృష్టించిన - నాథుని పొగడెదము స్తుతిగానము చేసెదము
1. ఆదిఆదాము మరణశాసనము - మా శరీరమున్ ఏలుచుండగా(2) అమరుడవై ప్రభూ - భువికేతెంచి(2) మరణపు ముల్లువిరచి మరణమున్ గెలచిన మా ప్రభువా (2) || తంబుర ||
2. పాపమునుండి చీకటినుండి - ఆశ్చర్యకరమగు వెలుగులోనడిపి తన ఆలయముగ చేసిన ప్రభుకు స్తుతి మహిమ - ఘనత - సీయోనులో అర్పంచెదమెప్పుడు || తంబుర ||
3. పరలోక పిలుపుతో - ప్రభు మమ్ము పిలిచి - నరకపు శిక్ష తొలగించె మానుండి పరిశుద్ధులతో - మమ్ము చేర్చిన ప్రభూ నిర్మించెను యిలలో - గృహముగా తన ఆత్మ ద్వారా || తంబుర ||
4. ఆత్మీయ యింటికి క్రీస్తే పునాది - సజీవమైన రాళ్ల ప్రజలు ఆత్మీయ గృహమునకు ప్రభువే శిల్పి - ఆద్యంతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము || తంబుర ||
5. మన్నయినది వెనుకటివలెనే - మరల భూమికి తప్పక చేరున్ మానవ సంపద కీర్తి మహిమలు గతించిపోవునిల సియోను మరువకు నీ ప్రభుని || తంబుర ||
6. లెబానోను వీడి నాతో రమ్ము - లోకపు ఆశలు గతించిపోవును హెర్మోను గెత్సెమనే గొల్గొతా దాటుచు హెబ్రోను చేరుదము - ప్రభువును ఆరాధించెదము || తంబుర ||