18px
#638Telugu Spiritual Song

Yehovaa nee naamamuenthobalamainadi

యెహోవా నీ నామము ఎంతో బలమైనది - ఆ..ఆ...ఆ... ఎంతో బలమైనది

ప|| యెహోవా నీ నామము ఎంతో బలమైనది - ఆ..ఆ...ఆ... ఎంతో బలమైనది యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది - ఆ..ఆ..ఆ.... ఎంతో ఘనమైనది
1. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి(2) యెహోషువా ప్రార్థించగా సూర్యచంద్రులనాపితివి (2) || యెహోవా ||
2. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా(2) అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి(2) || యెహోవా ||
3. సింహాలబోనుకైనా - సంతోషముగా వెళ్లిరి(2) ప్రార్థించిన వెంటనే - రక్షించె నీ హస్తము(2) || యెహోవా ||
4. చెరసాలలో వేసినా - సంకెళ్లు బిగియించినా(2) సంఘముతో ప్రార్థించగా - సంకెళ్లు విడిపోయెను(2) || యెహోవా ||
5. పౌలు సీలలను బంధించి - చెరసాలలో వేసినా(2) పాటలతో ప్రార్థించగా - చెరసాల బ్రద్ధలాయె(2) || యెహోవా ||