18px
#645Telugu Spiritual Song

O yesu nee prema - entho mahaaneeyamu =

ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము

ప|| ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము - ఆకాశతార పర్వత సముద్ర - ములకన్న గొప్పది (2)
1. అగమ్య ఆనందమే హృదయమునిండెను - ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి ఉదయసాయంత్రములు - స్తుతికి యోగ్యములు (2) || ఓ యేసు ||
2. సంకట సమయములో సాగలేకున్నాను - దయచూపు నా మీద అని నేను మొఱ్ఱపెట్టగా వింటినంటివి నా మొఱ్ఱకు ముందే - తోడనుందునంటివి (2) || ఓ యేసు ||
3. కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడు - పచ్చిక బయలులో పరుండజేయును భోజన జలములతో తృప్తిపరచును - నాతోనుండునేసు (2) || ఓ యేసు ||
4. దేవుని గృహములో సదా స్తుతించెదను - సంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంస - లకు యోగ్యుడేసు - హల్లేలూయ ఆమేన్ (2) || ఓ యేసు ||