#646Telugu Spiritual Song
Stothrinchedanu - stothrinchedanu - yesu devudaa
స్తోత్రించెదను స్తోత్రించెదను - యేసు దేవుడా
ప|| స్తోత్రించెదను స్తోత్రించెదను - యేసు దేవుడా
మా జీవనాధా - ప్రేమనాధ - స్తోత్రించెదను (2)
1. ఏడు నక్షత్రములను కుడిచేతపట్టుకొని
ఏడు దీపంబుల మధ్య సంచరించువాడా
2. మొదటివాడా కడపటివాడా మృతుడైనవాడా
మృతిని గెల్చిలేచినవాడా - మది నిను దలచెను
3. వాడియైన రెండంచుల ఖడ్గము కలవాడా
పాడి నిన్ను భజియించెదము - పరమ పురివాస
4. అగ్ని జ్వాలలవంటి కన్నులు కలిగినవాడా
అపరంజి బోలిన పాదములు - దేవుని కుమార
5. ఏడు నక్షత్రములు - దేవుని ఏడాత్మలునూ
కలిగినవాడా కరుణించి మము - కాపాడుమయ్యా
6. దావీదు తాళపు చెవిని - బడసినవాడా
సత్య స్వరూపి పరిశుద్ధుండా - సంఘములకు కర్త
7. ఆమెన్ అనువాడా నమ్మకమైన నాధుండ
సత్యసాక్షి దేవుని సృష్టికి ఆదియు నీవేగా
