#650Telugu Spiritual Song
Reyimpagalu nee padhaseve yesu prabhuvaa cheyutamelu
రేయింపగలు నీ పదసేవే యేసుప్రభువా చేయుట మేలు
ప|| రేయింపగలు నీ పదసేవే యేసుప్రభువా చేయుట మేలు -
సాటిలేని దేవుడ నీవె నాదు కోట కొండయు నీవె
1. పరమపురిలో వరదా నిరతం దూతగణముల స్తుతులను సల్పి
శుద్ధుడ పరిశుద్ధుడనుచు పూజనొందె దేవుడు నీవె || రేయి ||
2. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే
సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా || రేయి ||
3. పెంటకుప్పల నుండి దీనుల పైకిలేపు ప్రభుడవు తగునా గర్వమణచి
గద్దెలు దింపి ఘనులనైనా మేపవ గడ్డి || రేయి ||
4. నరుల నమ్ముట కంటె నిజముగ నీదు శరణం శరణం దేవా
రాజులను ధరనమ్ముట కంటె రాజరాజవు నాకాశ్రయము || రేయి ||
5. అగ్ని వాసనంటకుండా అబెద్నగోలతో నుండిన దేవా
దానియేలును సింహపు బోనులో ఆదుకొన్న నాధుడ నీవే || రేయి ||
6. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు పరము చేర్చు పదము నీవే
అడుగుజాడల నడచిన హనోకు పరము చేరె ప్రాణముతోడ || రేయి ||
7. మృతుల సహితము లేపినావు మృతిని గెల్చి లేచినావు
మృతులనెల్ల లేపేవాడవు - మృత్యువును మృతి లేపినావు || రేయి ||
