#649Telugu Spiritual Song
Deva samsthuthi cheyave manasa- sri manthudagu Yehova
దేవ సంస్తుతి చేయవే మనసా - శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి
ప|| దేవ సంస్తుతి చేయవే మనసా - శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి
చేయవే మనసా - దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా దేవుని
పావన నామము స్తుతించును - నా యంతరంగము - లో
వసించు నో సమస్తమా - ఆ కారణముచే || దేవ ||
1. జీవమా యెహోవా నీకు జేసినా మేళ్లన్ మరువకు - నీవు చేసిన పాతకంబులను
మన్నించి జబు" - లేవియున్ లేకుండ జేయును - ఆ కారణముచే || దేవ ||
2. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగ వేయును -
నీ శిరసు మీద జీవ కిరీటముగ వేయును - ఆ కారణముచే || దేవ ||
3. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త్త - యౌవనంబై వెలయునట్లుగ
మేలిచ్చి నీదు - భావమును సంతుష్టి పరచునుగా - ఆ కారణముచే || దేవ ||
4. ప్రభువు నీతి పనులు చేయున్ - బాధితులకు న్యాయమిచ్చున్ - విభుడు మార్గము
తెలిపె మోషేకు - దనకార్యములను విప్పె నిశ్రాయేలు జనమునకు - ఆకారణముచే
5. అత్యధిక ప్రేమ స్వరూపి - యైన దీర్ఘశాంతపరుడు - నిత్యము వ్యాజ్యంబు చేయడు
ఆ కృపోన్నతుడు నీపై నెపుడు కోపముంచడు - ఆ కారణముచే || దేవ ||
6. పామరులమని ప్రత్యుపకార - ప్రతిఫలంబుల్ పంపలేదు - భూమికన్న నాకసంబున్న
యెత్తుండు దైవ ప్రేమ భక్తి జనులయందున - ఆ కారణముచే || దేవ ||
7. పడమటికి తూర్పెంత యెడమో - పాపములకును మనకునంత యెడము కలుగజేసి
యున్నాడు మన పాపములను యెడముగానే చేసియున్నాడు - ఆ కారణముచే
8. కొడుకులపై తండ్రికి జాలి - పడు విధముగా భక్తి పరులయెడల జాలి - పడును
దేవుండు - తన భక్తి పరుల - యెడల జాలిపడును దేవుండు - ఆకారణముచే || దేవ ||
9. మనము నిర్మితమయిన రీతి - తనకు దెలిసియున్న సంగతి మనము మంటివార
మంచును - జ్ఞాపకము చేసి - కొనుచు కరుణజూపుచుండును - ఆకారణముచే || దేవ ||
