18px
#652Telugu Spiritual Song

Krupalanu talanchuchu - aayushkaalamantaa prabhuni

కృపలను తలంచుచు - ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్

ప|| కృపలను తలంచుచు - ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్(2)
1. మిమ్మును ముట్టినవాడు - నా కంటిపాపను2) ముట్టునని సెలవిచ్చిన దేవుడు - కాచెను గతకాలం నన్ను || కృపలను ||
2. రూపింపబడుచున్న ఏ ఆయుధముండినను(2) నాకు విరోధమై వర్థిల్లదుయని - చెప్పిన మాట సత్యం ప్రభువు || కృపలను ||
3. కన్నీటి లోయలలో - నే కృంగిన వేళలో(2) నింగిని చీల్చి వర్షము పంపి - నింపెను నా హృదయం! యేసు || కృపలను ||
4. సర్వోన్నతుడైన నా దేవునితో చేరి(2) సతతము తన కృప వెల్లడిచేయు - స్తుతులతో నింపెను యిలలో || కృపలను ||
5. హల్లెలూయ ఆమేన్.... - ఆ నాకెంతో ఆనందమే (2) సీయోన్నివాసం నాకెంతో ఆనందం - ఆనందమానందమే - ఆమేన్ || కృపలను ||