18px
#653Telugu Spiritual Song

Lekkinchaleni sthothramul - devaa ellappudu ne paadedan

లెక్కించలేని స్తోత్రముల్ - దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్

ప|| లెక్కించలేని స్తోత్రముల్ - దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్(2) ఇంతవరకు నా బ్రతుకులో (2) - నువ్వు చేసిన మేళ్లకై || లెక్కించలేని ||
1. ఆకాశ మహాకాశముల్ - వాటియందున్న సర్వంబును(2) భూమిలో కనబడునవన్ని (2) - ప్రభువా నిన్నే కీర్తించున్ || లెక్కించలేని ||
2. అడవిలో నివసించునవన్ని - సుడిగాలియు మంచును(2) భూమిపైనున్నవన్ని (2) - దేవా నిన్నే పొగడును || లెక్కించలేని ||
3. నీటిలో నివసించు ప్రాణుల్ - ఈ భువిలోన జీవరాసులు(2) ఆకాశమున ఎగురునవన్ని (2) - ప్రభువా నిన్నే కీర్తించున్ || లెక్కించలేని ||