18px
#654Telugu Spiritual Song

Sthothram chellinthumu - sthuthi sthothram chellinthumu

స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము

ప|| స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము(2) యేసునాథుని మేలులు తలంచి - స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
1. దివారాత్రములు కంటిపాపవలె కాచి(2) - దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి(2)
2. గాఢాందకారములో కన్నీటి లోయలలో(2) కృశించిపోనీయక కృపలతో బలపరచితివి (2) || స్తోత్రం ||
3. సజీవయాగముగా మా శరీరము సమర్పించి(2) సంపూర్ణ సిద్ధినొంద శుద్ధాత్మను నొసగితివి (2) || స్తోత్రం ||
4. సీయోను మార్గములో పలు శోధనలు రాగా(2) సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2) || స్తోత్రం ||
5. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి(2) యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2) || స్తోత్రం ||
6. పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా(2) సద పాడెద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా (2) || స్తోత్రం ||