#656Telugu Spiritual Song
Neethigala yehovaa sthuthi mee – aathmatho narpinchudi
నీతిగల యెహోవా స్తుతి మీ - ఆత్మతో నర్పించుడి
ప|| నీతిగల యెహోవా స్తుతి మీ - ఆత్మతో నర్పించుడి
మీ ఆత్మతో నర్పించుడి - దాతయవు మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి
1. చదల బుడమియు రవియు జలధియు - నదులు గిరులును జక్కగా
సదమలంబగు దైవనామము - సర్వదా నుతిజేయును || నీతి ||
2. సర్వశక్తుని కార్యములకీ - సర్వర్రాష్టములన్నియు
గర్వములు విడి తలలు వంచుచు - నుర్విలో నుతిజేయను || నీతి ||
3. గీత తాండవ వాద్యములచే - ప్రీతి పరచెడు సేవతో
పాతకంబులు పరిహరించెడు - దాతనే సేవించుడి || నీతి ||
4. పరమదూతలు నరులు పుడమిని - మొరలుబెట్టుచు దేవుని
పరమునందున్నట్టి యేసుని - పాదములు సేవింతురు || నీతి ||
5. ఇలను భక్తులు గూడుకొనియా - బలము గల్గిన దేవుని
వెలయు స్తుతి వే నోళ్లతోడను - విసుగు జెందకజేయుడి || నీతి ||
6. ఆత్మ నీవిక మేలుకొని శు - ద్ధాత్మ యేసుని దండ్రిని
త్వరితమగునా యేక దేవుని - హర్షమున సేవింపవే || నీతి ||
