#657Telugu Spiritual Song
Parishudha parishudha parishudha prabhuva –
పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా - వరదూతలైన నిన్ వర్ణింపగలరా
ప|| పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా - వరదూతలైన నిన్ వర్ణింపగలరా || పరి ||
1. పరిశుద్ధ జనకుడ - పరమాత్మరూపుడ - నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ || పరి ||
2. పరిశుద్ధ తనయుడ - నరరూపధారుడ - నరులను రక్షించు కరుణా సముద్రా || పరి ||
3. పరిశుద్ధమగునాత్మ - వరములిడునాత్మ - పరమానంద ప్రేమ భక్తుల కిడుమా || పరి ||
4. జనక కుమారాత్మలను నేక దేవా - ఘన మహిమ చెల్లును - దనర నిత్యముగా || పరి ||
