18px
#658Telugu Spiritual Song

Premaamrutha dhaaralu chindina mana - yesuku samamevaru?

ప్రేమామృత ధారలు చిందిన మన - యేసుకు సమమెవరు?

ప|| ప్రేమామృత ధారలు చిందిన మన - యేసుకు సమమెవరు? ప్రేమయే తానై నిలచి - ప్రేమోక్తులనే పల్కి ప్రేమతో ప్రాణము బెట్టి - ప్రేమనగరికి చనియె
1. నిశ్చలమైన ప్రేమ జీవికి - ఇలలో తావేది ప్రేమ ద్రోహులే గాని - ప్రియమున జేరరు వాని చేరిన చెలికాడగురా - సమయమిదే పరుగిడిరా
2. ఎంత ఘోరపాపాత్ములనైన - ప్రేమించును రారా పాపభారముతో రారా - పాదములపై బడరా పాపుల రక్షకుడేసు - తప్పక నిను రక్షించు
3. ఇంత గొప్ప రక్షణను - నిర్లక్ష్యము చేసెదవేల రక్షణ దిన మిదియేరా - తక్షణమే కనుగొనరా ఇదియే దేవుని వరము - ముదమారగ చేకొనుము