18px
#659Telugu Spiritual Song

Hrudayamanedu thalupu noddha yesu naadundu nilachi sadhayu

హృదయమనెడు తలుపునొద్ద యేసునాధుండు నిలచి

ప|| హృదయమనెడు తలుపునొద్ద యేసునాధుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను
1. పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడ నతడు పరుడు గాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు || హృదయ ||
2. కరుణాశీలుండతడు గాన గాచియున్నాడు - యేసు కరుణ నెఱిగి గారవింపగరము న్యాయంబు || హృదయ ||
3. ఎంతసేపు నిలువబెట్టి యేడ్పింతురతని నాతడెంతో దయచే బిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను || హృదయ ||
4. అతడు మిత్రుడతడు మిత్రుండఖిల పాపులకు మరిలతని పిలుపు వింటిరేని యతడు ప్రియుడగును || హృదయ ||
5. జాలిచేత దన హస్తముల జాపియున్నాడు మిమ్ము నాలింగనము సేయగోరి యనిశము కనిపెట్టు || హృదయ ||
6. సాటిలేని దయగలవాడు సర్వేశుసుతుడు తన మాట వినెడు వారలనెల్ల సూటిగ రక్షించు || హృదయ ||
7. చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసునాధునతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము గృపను || హృదయ ||
8. అతడు తప్పక కలుగజేయు నఖిల భాగ్యములు మీరలతని హత్తుకొందు రప్పుడానందముతోడ || హృదయ ||
9. బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడ గాన బ్రతికి యుండు కాలముననే ప్రభుని గొలువండి || హృదయ ||