18px
#662Telugu Spiritual Song

Randi suvaartha sunaadamutho

రండి సువార్త సునాదముతో - రంజిలు సిలువ నినాదముతో

ప|| రండి సువార్త సునాదముతో - రంజిలు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో - ప్రభుయేసు దయానిధి సన్నిధికి (2)
1. యేసే మానవజాతి వికాసం - యేసే మానవ నీతి విలాసం యేసే పతీత పావన నామం - భాసుర క్రైస్తవ శుభనామం || రండి ||
2. యేసే దేవుని ప్రేమ స్వరూపం - యేసే సర్వేశ్వర ప్రతిరూపం యేసే ప్రజాపతి పరమేశం - ఆశ్రిత జనముల సుఖవాసం || రండి ||
3. యేసే సిలువను మోసిన దైవం - యేసే ఆత్మల శాశ్వత జీవం యేసే క్షమాపణ అధికారం - దాసుల ప్రార్థన సహకారం || రండి ||
4. యేసే సంఘములో మన కాంతి - యేసే హృదయములో ఘన శాంతి యేసే కుటుంబ జీవన జ్యోతి - పసిపాపల దీవెనమూర్తి || రండి ||
5. యేసే జీవన ముక్తికి మార్గం - యేసే భక్తుల భూతల స్వర్గం యేసే ప్రపంచ శాంతికి సూత్రం - వాసిగ నమ్మిన జన స్తోత్రం || రండి ||