#663Telugu Spiritual Song
Manulu maanikyamulunna - medamiddelu ennunnaa
మణులు మాణిక్యములున్న - మేడమిద్దెలు ఎన్నున్నా
ప|| మణులు మాణిక్యములున్న - మేడమిద్దెలు ఎన్నున్నా
మదిలో యేసు లేకున్నా - ఏది వున్నా అది సున్నా
1. చదువులెన్నో చదివున్నా - పదవులెన్నో చేస్తున్నా
విద్య వున్నా బుద్ధి వున్నా - జ్ఞానమున్నా అది సున్నా || మణులు ||
2. అందచందాలెన్నున్నా - అందలముపై కూర్చున్నా
సుందరుడగు ప్రభు లేకున్నా - అందమున్నా అది సున్నా || మణులు ||
3. రాజ్యములు రమణులున్నా - శలొర్యములు గల వీరులున్నా
బలము వున్నా బలగమున్నా - ఎన్నియున్నా అవి సున్నా || మణులు ||
4. పూజ్యుడా పుణ్యాత్ముడా - పుణ్యకార్య సిద్దుడా
దానధర్మము తపము జపము - యేసు లేనివి అన్నీ సున్నా || మణులు ||
