#664Telugu Spiritual Song
Rammoo nee tharunamide piluchuchunnaadu
రమ్మూ నీ తరుణమిదే పిలుచుచున్నాడు - నీ ప్రభువైన యేసు నొద్దకు - రమ్మూ
ప|| రమ్మూ నీ తరుణమిదే పిలుచుచున్నాడు - నీ ప్రభువైన యేసు నొద్దకు - రమ్మూ
1. జీవితమంతయు వ్యర్థముగాను - దుఃఖముతోను గడుపుట యేల
వచ్చి ఆయన శరణు జొచ్చినచో - వాంఛతో నిన్ను స్వీకరించున్ || రమ్మూ ||
2. కట్టిన యిల్లు ధన ధాన్యములు - కనబడు బంధు మిత్రాదులును
గూడు విడచి నీవు పోయినచో - వెంట నీతో రారెవరు || రమ్మూ ||
3. అందము మాయ నిలకడలేనిది - దాని నమ్మకుము మోసగించును
మరణము ఒకనాడు వచ్చున్ - మరువకు నీ ప్రభువును || రమ్మూ ||
4. మిన్ను క్రింద భూమి మీదన్ - మిత్రుడు యేసు నామముగాక
రక్షణ పొందు దారిలేదు - రక్షకుడేసే మార్గము || రమ్మూ ||
5. తీరని పాప వ్యాధులను - మారని నీదు బలహీనతను
ఘోర సిలువలో మోసి తీర్చున్ - గాయములచే బాగుపడన్ || రమ్మూ ||
6. సత్యవాక్కును నమ్మి రమ్ము - నిత్యజీవము నీకు యిచ్చును
నీ పేరు జీవపుస్తకమునందు - నిజముగ ఈనాడే ్రవాయున్ || రమ్మూ ||
