18px
#669Telugu Spiritual Song

Neevu chesina upakaramulaku nenemi chellinthunu

నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును

ప|| నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా? వేలాది పొట్టేళ్లనా?
1. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా(2) గర్భఫలమైన నా జ్యేషష్ఠ పుత్రుని నీకిచ్చినా చాలునా (2)
2. మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిల్వలో(2) కరుణజూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా(2)
3. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయ మర్పింతును (2) రక్షణ పాత్రను చేబూని నిత్యము నిను వెంబడించెదను(2)
4. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును? (2) కపట నటనలు చాలించి నిత్యము నిను వెంబడించెదను(2)