#668Telugu Spiritual Song
Yesuni korakai ila jeevincheda bhaasuramuga ne nanudhinamu
యేసుని కొరకై యిల జీవించెద భాసురముగ నే ననుదినము
ప|| యేసుని కొరకై యిల జీవించెద భాసురముగ నే ననుదినము
దోసములన్నియు బాపెను మోక్ష నివాసమున ప్రభు జేర్చునుగా || యేసుని ||
1. నాశనకరమగు గుంటలో నుండియు - మోసకరంబగు యూబి నుంటి
నాశచే నిలపైకెత్తెను నన్ను పి - శాచి పథంబున దొగించెన్ || యేసుని ||
2. పలు విధముల పాపంబును జేసితి వలదని ద్రోసితి వాక్యమును
కలుషము బాపెను కరుణను బిలిచెను సిలువలో నన్నాకర్షించెన్ || యేసుని ||
3. అలయక సొలయక సాగిపోదును వెలయగ నా ప్రభు మార్గములన్
కలిగెను నెమ్మది కలువరి గిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు || యేసుని ||
4. శోధన బాధలు శ్రమలు కల్గిన ఆదుకొనును నా ప్రభువనిశం
వ్యాధులు లేములు మరణము వచ్చిన నాధుడే నా నిరీక్షణగున్ || యేసుని ||
5. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమైయున్నవి ప్రభునందు
అద్భుతముగ ప్రభువన్నియు నొసగి దిద్దును నా బ్రతుకంతటిని || యేసుని ||
6. అర్పించెను దన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువు
అర్పింతుము నా యావజ్జీవము రక్షకుడేసుని సేవింప || యేసుని ||
7. ప్రభు నందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో
విభుడే దీర్చును యిల నా చింతలు అభయముతో స్తుతియింతు ప్రభున్ || యేసుని ||
8. యౌవన జనమా యిదియే సమయము యేసుని చాటను రారండి
పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్ || యేసుని ||
