18px
#671Telugu Spiritual Song

Kummari o kummari jagathuthpaththidaari

కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తి దారి - జిగట మన్నైన నావంక చల్లగ

ప|| కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తి దారి - జిగట మన్నైన నావంక చల్లగ చూడుమయ్యా ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా
1. పనికిరాని పాత్రనని పారవేయకుమా - పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా(2) సువార్తలోని పాత్రలన్నీ - శ్రీయేసుని పొగడుచుండ - సాక్షిగా నుండు పాత్రగజేసి సత్యముతో నింపుము తండ్రి - ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి || కుమ్మరి ||
2. విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవ్వరు - వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగ జేసి (2) - ఆటంకముల నుండి తప్పించి నన్ను - ఎల్లప్పుడు కావుమయ్యా - పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్యా ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా || కుమ్మరి ||
3. లోకాశతో నిండి ఉప్పొంగుచూ - మార్గంబు నే దప్పితిన్ - మనుషేచ్చలన్నియు స్థిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని (2) - పోగొట్టుకున్న పాత్రయనుచు పరగెత్తి నను పట్టితివి - ప్రాణంబు నాలో ఉన్నప్పుడే - నీ పాదంబుల్పట్టితిన్ ఆ ఆ ఆ నీ పాదంబుల్పట్టితిన్ || కుమ్మరి ||