#672Telugu Spiritual Song
Dinadinambu yesuku daggaraga cheruthaa
దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా
ప|| దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా
అనుక్షణంబు యేసుని నా మదిలో కోరుతా
ఎల్లప్పుడు యేసువైపు కనులెత్తి పాడుతా
ప్రభుని మాట నాదు బాట విభునితోనే సాగుతా
1. మారిపోయే లోకమందు మనుష్యులెంతో మారినా
మారునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడ చేరనా
2. దైవవాక్యం జీవవాక్యం దినదినంబు చదువుతా
ప్రభుని మాట నాదు బాట విభునితో మాట్లాడుతా
3. ఎన్నడు ఎడబాయడు నను విడువడు ఏమాత్రము
ప్రభువే నాదు అభయము భయపడను నేనే మాత్రము
4. పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలిచెద
సిలువ మోసి సేవ చేయ యేసుతోనే కదలుతా
