#673Telugu Spiritual Song
Enduko nanninthagaa neevu - preminchithivo devaa
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
ప|| ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)
1. నాపాపము బాప నరరూపివైనావు - నా శాపము మాప నలిగి ్రవేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే - నా స్థానములో నీవే (2) || ఎందుకో ||
2. నీ రూపము నాలో నిర్మించియున్నావు - నీ పోలికలోనే నివసించుమన్నావు
నీవు నన్ను ఎన్నుకున్నావు - నీ కొరకై నీ కృపలో (2) || ఎందుకో ||
3. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు - నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చేర్చుకున్నావు - నను దాచియున్నావు (2) || ఎందుకో ||
4. నీ సన్నిధి నాలో నా సర్వము నీలో - నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు - నను విడువనంటివి (2) || ఎందుకో ||
5. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం - నేనేమి చెల్లింతున్ (2) || ఎందుకో ||
