18px
#675Telugu Spiritual Song

Yesu naadu kaapari vaani - vaasigaa stutinchedan

యేసునాదు కాపరి వాని - వాసిగా స్తుతించెదన్

ప|| యేసునాదు కాపరి వాని - వాసిగా స్తుతించెదన్ యేసు గొర్రె పిల్లను - పోయెదను తన వెంట
1. పచ్చిక పట్లకు - మచ్చికతో నడువున్ - స్వచ్ఛ జలముచెంత నిచ్చును విశ్రాంతిన్ ముందు ముందు వెళ్లుచు - పొందుగ రక్షించు నన్ను తన మాధుర్య స్వరంబున - తనివి దీర్చును || యేసు ||
2. మరణలోయ ద్వారా - సరిగా నడిపించును అడవి భయములెల్ల - ఎడబాపి రక్షించున్ హత్తి ఒత్తి కట్టి గాయా - లెంతో ఆదరించును వింతగు వాని ప్రేమను సేవలో - సంతోషింతును || యేసు ||
3. శత్రువుల ముందాహారం - సంసిద్ధము జేయును నా గిన్నె నిండించి పొర్లిపారజేసి కడిగి కడిగి శుద్ధిచేసి - ఆత్మ దాన మిచ్చెను వడిగ వాని సాయమున - జయమున వెళ్లేదను || యేసు ||