18px
#676Telugu Spiritual Song

Israyelu sainyamunaku -mundu nadachina daivamaa=

ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా

ప|| ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా నేడు మాతో కూడానుండి మమ్ము నడిపించుము
1. సొలొమోను దేవాలయములో మేఘము రాగానే యాజకులు నీ తేజోమహిమకు నిలువలేకపోయిరి
2. పూర్వము ప్రవక్తలతో నరుల - రక్షణ ప్రకటించి నన్ను వెదకని వారికినే దొరికితినంటివి || ఇశ్రాయేలు ||
3. నరులయందు నీదు ప్రేమ - క్రీస్తు ద్వారా బయలుపరచి సిల్వరక్తము చేత మమ్ము రక్షించియుంటివి || ఇశ్రాయేలు ||
4. ఆది యాపొస్తులులపై నీ యాత్మ వర్షము కుమ్మరించి నట్లు మాపై కుమ్మరించి - మమ్ము నడిపించుము || ఇశ్రాయేలు ||