18px
#677Telugu Spiritual Song

Nadipinchu naa naavaa – nadi sandramuna devaa

నడిపించు నా నావ - నడి సంద్రమున దేవా

ప|| నడిపించు నా నావ - నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున - నా జన్మ తరియింప || నడిపించు ||
1. నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము నా సేవచేకొనుము || నడిపించు ||
2. రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభూ జయము రహదారులు వెదకినను రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవ || నడిపించు ||
3. ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి ఆశ నిరాశయే ఆవేదనెదురాయే - ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నా వలలు || నడిపించు ||
4. ప్రభుమార్గము విడచితిని - ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని - పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో - ప్రావీణ్యమును బొంది ఫలహీనుడనై యిపుడు - పాటింతు నీ మాట || నడిపించు ||
5. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి - లోపంబులు సవరించి లోనున్న ఈవులలో - లోటైన నా బ్రతుకున్ లోపించని అర్పణగా - లోకేశ చేయుమయా || నడిపించు ||
6. ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో - పరిశుద్ధుని ప్రేమకథ పరమాత్మ ప్రోక్షణతో - పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభుకొరకు - పానార్పణము జేతు || నడిపించు ||