18px
#679Telugu Spiritual Song

Bhayamu ledu - digulu ledu - jeevitha yaathralo

భయము లేదు దిగులు లేదు జీవితయాత్రలో

ప|| భయము లేదు దిగులు లేదు జీవితయాత్రలో యేసుప్రభువు మనతోనుండ - భయము లేదుగా హల్లేలూయ - హలేలూయ(2)
1. గాలి తుఫాను రేగి అలలు పొంగినా - విశ్వాస నావ మునిగి కొట్టబడిన సముద్రము పొంగి నురుగు కట్టిన - యేసుప్రభువు మనతోనుండ భయములేదుగా(2)
2. వ్యాధి బాధలు నన్ను ముట్టినా - అంతులేని వేదనా నాకు కల్గిన గర్జించు సింహము ఎదురువచ్చిన - యేసుప్రభువు మనతోనుండ భయములేదుగా(2)
3. శత్రువున్ చూచి విస్మయమొందకు - నీతో కూడా వచ్చువాడు నీ దేవుడే నిన్ను విడువడెన్నడు ఎడబాయడు - యేసుప్రభువు మనతోనుండ భయములేదుగా(2)