#681Telugu Spiritual Song
Aananda yaatra idi aatmeeya yaatra
ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర - యేసుతో నూతన యెరూషలేము యాత్ర
ప|| ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర - యేసుతో నూతన యెరూషలేము యాత్ర
మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర
1. యేసుని రక్తము పాపములనుండి విడిపించెను(2)
వేయి నోళ్లతో స్తుతించినను తీర్చలేము ఆ ఋణమును (2) || ఆనంద ||
2. రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా(2)
మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా (2) || ఆనంద ||
3. కృతజ్ఞత లేనివారు వేలకొలదిగ కూలినను(2)
కృపా వాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపను పొందెదము (2) || ఆనంద ||
4. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం
ఆత్మానంద భరితులమై ఆగమనాకాంక్షతో సాగెదం || ఆనంద ||
