#682Telugu Spiritual Song
Lemmu thejarillumu neeku - velugu vachchi yunnadi
లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది
ప|| లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది
అ.ప. యెహోవా మహిమ నీపై - ప్రకాశముగా నుదయించె
1. జనములు నీదు వెలుగునకు - పరుగెత్తి వచ్చెదరు
రాజులు నీదు ఉదయ - కాంతికి వచ్చెదరు
2. సముద్ర వ్యాపారము - నీ వైపు త్రిప్పబడును
జనముల ఐశ్వర్యము - నీ యొద్దకు వచ్చును
3. దేవదారు సరళగొంజి - చెట్లు నా ఆలయమునకు
తేబడును నాదు పాద - స్థలము మహిమ పరచెదను
4. నన్ను శాశ్వతమైన - శోభాతిశయముగా జేతున్
బహుతరములకు సంతోష కారణముగ జేసెదను
5. వారిలో ఒంటరియైన - వాడు పది వందలగును
ఎన్నికలేనివాడు - బలమైనట్టి జనమగును
