#633Telugu Spiritual Song
Silvalo naakai kaarchenu – yesu rakthamu
సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము - శిలనైన నన్ను మార్చెను యేసురక్తము
ప|| సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము - శిలనైన నన్ను మార్చెను యేసురక్తము
యేసురక్తము ప్రభుయేసు రక్తము (2) - అమూల్యమైన రక్తము - యేసురక్తము
1. సమకూర్చునన్ను తండ్రితో యేసురక్తము - సంధిచేసి చేర్చును యేసురక్తము
యేసురక్తము ప్రభుయేసు రక్తము (2) - ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము
2. సమాధానపరచును యేసురక్తము - సమస్యలన్ని తీర్చును యేసురక్తము
యేసురక్తము ప్రభుయేసు రక్తము (2) - సంపూర్ణ శాంతినిచ్చును - యేసురక్తము
3. నీతిమంతులుగ జేయును యేసురక్తము - దుర్నీతినంతబాపును - యేసురక్తము
యేసురక్తము - ప్రభుయేసురక్తము(2) - నిబంధన నిలుపు రక్తము యేసురక్తము
4. రోగములను బాపును యేసురక్తము - దురాత్మల పారద్రోలును యేసురక్తము
యేసురక్తము ప్రభుయేసురక్తము (2) - శక్తిబలము నిచ్చును యేసు రక్తము
